Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాస్ బస్టర్' హిట్‌కు ధన్యవాదాలు నాన్నా : తండ్రికి తనయుడి అభినందన

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:49 IST)
రామ్ చరణ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా, అమితాబ్, జగపతి బాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నాలు కలిసి నటించారు. ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం యూనిట్ ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. 
 
ముఖ్యంగా, సినిమా రంగంలో పునఃప్రవేశం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ముఖంలో విజయోత్సాహం తొణికిసలాడుతోంది. సైరాకు విశేష స్పందన లభిస్తుండడంతో ఆయన హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఎంతో మనసుపడిన కథ, మనసుపెట్టి తీసిన దర్శకుడు, ఖర్చుకు వెనుకాడని నిర్మాత, నూటికి నూరుశాతం ప్రదర్శన ఇచ్చిన నటీనటులు, అద్భుత నైపుణ్యం కనబర్చిన సాంకేతిక నిపుణులు సైరా చిత్రాన్ని బ్లాక్ బస్టర్‌గా మలిచారన్నది ఇప్పటివరకు వచ్చిన రివ్యూల సారాంశం. 
 
ఈ నేపథ్యంలో, చిరంజీవి, రాం చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితర యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ద్వారా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ బాస్ బస్టర్‌కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments