Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పాలెగాడు ఉయ్యాలవాడ'కు ప్రాణప్రతిష్ట చేశారు : ఎస్.ఎస్. రాజమౌళి

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:22 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన 152వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి" అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకాగా, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం టాక్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి స్పందిస్తూ, సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారు. అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. 
 
నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని, సైరా నరసింహారెడ్డి ఘనవిజయానికి వారిద్దరూ అర్హులేనని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments