Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు మళ్లీ అవకాశం ఇవ్వండి లిటిల్ బాస్ : బండ్ల గణేశ్

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:06 IST)
చిన్న నటుడు స్థాయి నుంచి బిగ్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి బండ్ల గణేశ్. ఈయన నిర్మించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. అలాంటి వాటిలో గోవిందుడు అందరివాడేలే. రామ్ చరణ్ హీరోగా నటించగా, కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం గత 2014 అక్టోబరు ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని పురస్కరించుకుని నిర్మాత బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. రామ్ చరణ్‌ను లిటిల్ బాస్‌గా పేర్కొంటూ, మళ్లీ మీతో ఓ సినిమా తీయాలనుందని, ఆ సినిమాను బ్లాక్ బస్టర్‌గా ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. 'లిటిల్ బాస్ నాకు త్వరగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.
 
కాగా, హీరోగా రాణిస్తూనే రామ్ చరణ్ నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. ఈయన తన తండ్రి చిరంజీవి హీరోగా ఖైదీ నంబర్ 150 చిత్రం నిర్మించగా, తాజాగా 152వ చిత్రంగా సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండో తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments