మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సంచలన చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా, జగపతి బాబు, రవికిషన్ తదితరులు నటించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నుండి నిహారిక కొణిదెల ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. అలాగే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్‌ను అందించారు.
అయితే... చరణ్ మాత్రం నటించలేదు. దీనికి కారణం ఏంటి అని చిరంజీవిని అడిగితే... ఇంటర్వెల్ ముందు వచ్చే షేర్‌ఖాన్ అనే పాత్రను సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్‌లలో ఎవరో ఒకరితో చేస్తే బావుంటుందని అనుకున్నాం.
అలాగే చరణ్‌తో కూడా చేయిద్దామని మరో అభిప్రాయం కూడా వినపడింది. ఆ పాత్ర నాతో తలపడి యుద్ధం చేసే సమయంలో సైరా నీలాంటి దేశభక్తుడు ఎంతో అవసరం అంటూ నా చేతిలోని కత్తితో పొడుచుకుని చనిపోతుంది.
చరణ్ నా చేతిలో చనిపోయేలా ఉండే ఆ పాత్రలో నటిస్తే యాంటీగా అనిపిస్తుందనిపించింది. చివరకు స్క్రిప్ట్‌ను తగ్గించే క్రమంలో పాత్రనే తీసేయాల్సి వచ్చింది అని చెప్పారు. ఈ విధంగా చరణ్ ఈ సినిమాలో నటించకపోవడమే కాకుండా.. చరణ్ చేయాల్సిన పాత్రనే సినిమా నుంచి తేసేసారట. అదీ... సంగతి!