Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''సైరా''లో నయనతార నటన అదుర్స్.. చిరంజీవి, తమన్నా యాక్టింగ్‌కు జనాలు ఫిదా..

Advertiesment
''సైరా''లో నయనతార నటన అదుర్స్..  చిరంజీవి, తమన్నా యాక్టింగ్‌కు జనాలు ఫిదా..
, బుధవారం, 2 అక్టోబరు 2019 (15:24 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా  సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో నయనతార చిరంజీవి సరసన నటించింది. ఈ సినిమాలో నయన లుక్ అదిరిందని.. ఆయన నటన అద్భుతమని.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. తాజాగా సైరాలో ఆమె నటనకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
 
ఇదిలా ఉంటే.. భీమవరం మెగా అభిమానులపై రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రత్యేక ట్వీట్ చేశారు. మామయ్య చిరంజీవి హీరోగా, భర్త రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన 'సైరా' చిత్రం విడుదల సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.
 
భీమవరంలో చిరు అభిమానులు 250 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు అర కిలోమీటర్ వరకు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్‌ను ఉపాసన తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.
 
మరోవైపు సైరా సినిమాను చూసిన వారు చిరంజీవి నటనకు ముగ్ధులవుతున్నారు. సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. సినిమాలోని డైలాగులు రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నాల నటన కూడా అద్భుతమని ట్వీట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#SyeRaaNarasimhaReddy పక్కా బ్లాక్‌బస్టర్ హిట్... నెటిజన్స్ కామెంట్స్