Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ది లయన్ కింగ్'' కలెక్షన్స్ అదుర్స్.. అంతా డబ్బింగ్ చెప్పినవారి ఎఫెక్ట్..

Webdunia
సోమవారం, 22 జులై 2019 (13:47 IST)
ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీవారు సమర్పణలో 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో నిర్మించిన జంగిల్ యానిమేషన్ మూవీ ''ది లయన్ కింగ్'' ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.


విడుదల రోజు కంటే కూడా, ఆదివారం రోజున ఈ చిత్రం దాదాపు రెట్టింపు కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. ఇంగ్లీష్ ఫిల్మ్ అయినప్పటికీ.. స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని ప్రేక్షకులు అంటున్నారు. 
 
ఈ చిత్రానికి తెలుగు వర్షన్‌లో.. సింబా పాత్రకు నాని, అలాగే స్కార్ పాత్ర‌కి జ‌గ‌ప‌తి బాబు, ముఫాసాగా కి పి.ర‌విశంక‌ర్, టిమోన్‌గా అలీ, పుంబాగా బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పడంతో.. ప్రధాన పాత్రల నటన తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. 
 
ఇక అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా.. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అన్ని రికార్డులను బద్ధలు కొడుతోంది. ఇంకా మొట్ట మొదటి సారిగా ఇంగ్లీషు డబ్బింగ్ ఫిల్మ్ నైజాంలో ఆధిపత్యం చెలాయిస్తోంది.


ఇంకా మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు కలెక్షన్స్ కుమ్మరించిన సినిమాగా లయన్ కింగ్ నిలిచింది. మూడు రోజుల్లో ది లయన్ కింగ్ రూ.65.19 కోట్లను వసూళ్లు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments