Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiggBossTelugu5.. హౌస్‌లో నామినేషన్లపై రచ్చ మొదలు (video)

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (18:12 IST)
Bigg Boss Telugu 5
బిగ్ బాస్ ఐదో సీజన్ ఆట మొదలైంది. ఆట మొదటి రోజే.. నామినేషన్లలో హౌస్ మేట్స్ యాంకర్ రవిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘స్టార్ మా’ విడుదల చేసిన ప్రోమోలో హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియను చూపించారు. 
 
ఈ సందర్భంగా 19 మంది హౌస్‌మేట్స్ మధ్య అప్పుడే స్పర్థలు మొదలైనట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్.. హౌస్ మేట్స్ ఫొటోలతో ఉన్న డస్ట్ బిన్ కవర్లను గార్డెన్ ఏరియాలో ఉంచాడు. ఓ చెత్త ట్రాలీ ఇచ్చి.. నామినేట్ చేసినవారి చెత్త సంచిని అందులో వేయమని చెప్పాడు.
 
నామినేషన్లలో భాగంగా హౌస్‌లో మినీ వార్ మొదలైందని చెప్పుకోవచ్చు. సింగర్ శ్రీరామ చంద్ర ఎవరినో ఉద్దేశిస్తూ.. "బ్రో డోన్ట్ మైండ్" అనడంతో ఈ ప్రోమో స్టార్టయ్యింది. ఆ తర్వాత లోబో చెత్త సంచులను అటూ ఇటూ విసిరేస్తూ.. చివరికి రవి సంచిని పెట్టుకున్నాడు. "నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో’’ అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత యాని మాస్టర్.. సిరి సంచిని చెత్త ట్రాలీలో వేయడం కనిపించింది. 
 
అనంతరం సరయు ఆర్జే కాజల్‌ను నామినేట్ చేయడం కనిపించింది. చివరికి రవి నటరాజ్ మాస్టర్‌ను చూసి.. "మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రిట్‌గా అనిపిస్తున్నారు" అని కామెంట్ చేశాడు. ఇందుకు నటరాజ్ స్పందిస్తూ.. "నేను అలాగే ఉంటాను. నటించడం నాకు రాదు" అని కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాస సన్నీ.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. 
 
"మనం ఏం చేసినా.. మన వెనుక సైన్యం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఒక సైన్యం వస్తుంది" అని అన్నాడు. ఇందుకు షణ్ముఖ్ స్పందిస్తూ.. ‘‘నాకైతే ఆ ఫీలింగ్ లేదు’’ అని అనడంతో.. సన్నీ చెత్త సంచిని ట్రాలిలోకి కసితో విసరడం కనిపించింది. ఆ తర్వాత లహరీ, సరయు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం విశ్వ, జెస్సీల మధ్య వివాదం నెలకొంది. చివరిగా నటరాజ్.. జెస్సీని ఉద్దేశిస్తూ ‘‘ఇక్కడ అమాయకత్వంతో ఉంటే తొక్కేస్తారు’’ అని కామెంట్‌తో ప్రోమో ముగిసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments