Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమ్మగడ్డా మజాకా? నామినేషన్ల రోజే రాయలసీమలో పర్యటన, ఎందుకు?

నిమ్మగడ్డా మజాకా? నామినేషన్ల రోజే రాయలసీమలో పర్యటన, ఎందుకు?
, గురువారం, 28 జనవరి 2021 (22:37 IST)
రాష్ట్రరాజకీయాల్లో ప్రతిపక్ష, అధికార పార్టీ నేతల మధ్య వైరం కన్నా ఎన్నికల కమిషనర్, జగన్‌కు మధ్య వార్ ఎక్కువగా కనబడుతోంది. అందుకు ప్రధాన కారణం పంచాయతీ ఎన్నికలు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబితే.. ఎన్నికలు వెంటనే పెట్టాలని నిమ్మగడ్డ చెబుతూ ఎన్నికలకు వెళ్ళిపోయారు. ఇదంతా తెలిసిందే.
 
కానీ ఇప్పుడు ఎన్నికలు అస్సలు జరగనీయకుండా మొత్తం పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు మంత్రులు సిద్థమైనట్లు తెలుస్తోంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. ఏకగ్రీవం విషయం ఎస్ఈసి దృష్టికి తీసుకెళ్ళింది.
 
అంటే ప్రతిపక్షపార్టీకి చెందిన అభ్యర్థులెవరినీ అస్సలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుందని.. ఎస్ఈసి పట్టించుకోవాలని నేరుగా ఆయన దృష్టికే ఈ విషయాన్ని తీసుకెళ్ళారట. 
 
దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటనను సిద్థం చేసుకున్నారు. రేపు, ఎల్లుండి నిమ్మగడ్డ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియను స్వయంగా ఆయన పరిశీలించారు. నిమ్మగడ్డ పర్యటన జరగబోతోందనడంతో వైసిపి నాయకుల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. ఎన్నికలు వద్దంటే పెడుతున్న నిమ్మగడ్డ నామినేషన్ల విషయంలోను నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చేశారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారణాసిలో కేసీఆర్ కుటుంబం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు