Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొఘ‌లాయిల కాలంనాటి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు డేట్ ఫిక్స్ అయింది

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:32 IST)
Release date poster
పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
నేడు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" 2022 ఏప్రిల్ 29 న విడుదల అన్న విషయాన్ని స్పష్టం చేశారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" సినిమా  రూపొందుతోంది. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్నఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌,  మ‌ల‌యాళంభాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది.

త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.ఈచిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. 
 
క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments