Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరి హర వీర మల్లు.. అప్డేట్.. 2022 ఏప్రిల్ 29న రిలీజ్

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:00 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్"కు తర్వాత హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కన పెట్టేసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్”ను మొదలు పెట్టేశాడు పవన్. 
 
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ “హరిహర వీరమల్లు”ను పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యింది.
 
ఇదిలా ఉండగా నేడు పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ “హరిహర వీరమల్లు” నుంచి అప్డేట్ రిలీజ్ చేశారు. “ఎల్లప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారు. నిజమైన హీరో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం గౌరవంగా ఉంది” అంటూ క్రిష్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో “హరిహర వీరమల్లు” సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 
 
2022 ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 12న “భీమ్లా నాయక్” రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. 2022 ప్రథమార్థంలో పవర్ స్టార్ అభిమానులకు పండగ అన్నమాట. అతి తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పవన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments