చైత్ర‌రాయ్ ను అందుకోస‌మే సీరియ‌ల్‌లో తీసేశారు

Webdunia
గురువారం, 8 జులై 2021 (13:00 IST)
chaitra rai
న‌టి చైత్రారాయ్‌. క‌న్న‌ట న‌టి. తెలుగులో సీరియ‌ల్స్‌ను ఏలేస్తుంది. `అష్టాచెమ్మ‌` సీరియ‌ల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె క‌న్న‌డ సీరియ‌ల్స్‌లోనూ న‌టించింది. అయితే ప్ర‌ముఖ తెలుగు టీవీ ఛానల్ క‌న్న‌డ వారిని దిగుమ‌తి చేయ‌డంలో దిట్ట‌. అందుకే ఆమెను అంద‌రిలాగే త‌మ సీరియ‌ల్స్‌లో పెట్టేసింది. ఓ సంద‌ర్భంగా డ‌బుల్ రోల్ చేయాల‌ని త‌న కోరిక అని వెల్ల‌డించింది. వెంట‌నే ఆమెకు `అక్కా చెల్లెలు` సీరియ‌ల్‌లో న‌టించే అవ‌కాశం సీరియ‌ల్ ద‌ర్శక నిర్మాత‌లు ఇచ్చేశారు. చూడ్డానికి గ్లామ‌ర్‌గా వున్నా. న‌ట‌న‌లో పెద్ద‌గా ఫీలింగ్స్ క‌నిపించ‌క‌పోయినా ఆమెను సీరియ‌ల్‌లో రెండు పాత్ర‌ల‌లలో పెట్టేసి పెద్ద దాన్ని చేసేశారు.
 
అలాంటి ఆమెను ఆ సీరియ‌ల్‌నుంచి ష‌డెన్‌గా త‌ప్పించారు. ఆ త‌ర్వాత మ‌రో అమ్మాయి తెచ్చారు. అక్క‌డ క‌థ కూడా గ‌జిబిజిగా వుండ‌డంతో సీరియ‌ల్‌కు శుభం కార్డ్ కూడా వేసేశారు. న‌టి దూర‌మైతే గ‌తంలో అయితే ఏవో వార్త‌లు హ‌ల్ చేస్తుండేవి. కానీ సోష‌ల్‌మీడియా వ‌ల్ల ఎవ‌రు ఏం చేస్తున్నారో అప్‌డేట్స్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆమె గురించి తెలిసింది. త‌ను గ‌ర్భ‌వ‌తిని అని తెలియ‌జేస్తూ ఫొటోను పెట్టింది. అందుకే సీరియ‌ల్‌నుంచి త‌ప్పుకున్నాను. నేనేమీ సీరియ‌ల్స్‌కూ దూరం కాలేదు. మ‌ర‌లా వ‌చ్చి సీరియ‌ల్‌లో న‌టిస్తాను అంటోంది. మ‌హిళ‌ల‌కు త‌ల్లికావ‌డం అనేది గొప్ప వ‌రం. దాన్ని ఆస్వాదిస్తున్నా. మీరు ఎటువంటి సందిగ్థంలో వున్నాస‌రే పిల్ల‌ల్ని ఎంచుకోండి. అప్పుడు మ‌న‌సుతేలిక‌ప‌డుతుంది. నాకు కుటుంబం అంటే ముఖ్యం. త‌న భ‌ర్త ప్ర‌స‌న్న‌తో హ్యాపీగా వున్నాను. త్వ‌ర‌లో మ‌ర‌లా తిరిగి వ‌స్తానంటూ చెప్పింది. దీనితో ఆమె అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments