Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తలైవి'' ట్రైలర్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (18:21 IST)
Thalaivi
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'తలైవి'గా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. ఎ.ఎల్‌.విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
 
మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అది కూడా రెండు ప్రధాన నగరాలైన చెన్నై, ముంబైలలో 'తలైవి' ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. కంగనా రనౌత్‌, అరవింద స్వామి, నిర్మాతలు విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ఈ చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కరుణానిధి పాత్రలో నటించగా.. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో పూర్ణ నటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments