Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న‌ప్ప‌టినుంచి నితిన్‌ను టార్చ‌ర్ పెట్టే కీర్తి! అదే రంగ్‌దే ట్రైల‌ర్ (video)‌

చిన్న‌ప్ప‌టినుంచి నితిన్‌ను టార్చ‌ర్ పెట్టే కీర్తి! అదే రంగ్‌దే ట్రైల‌ర్ (video)‌
, శుక్రవారం, 19 మార్చి 2021 (19:45 IST)
Nitin, keerthy
నితిన్,  కీర్తి సురేశ్ జంటగా నటించిన ''రంగ్ దే'' సినిమా ఈనెల 26న థియేటర్లలోకి రానుంది. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్ర‌వారంనాడు చిత్ర యూనిట్ ట్రైల‌ర్ విడుద‌ల‌చేసింది.
 
అందులో ఏముందంటే!
'నేను అర్జున్.. దేవుణ్ణి నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ని ప్రసాదించమని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకన్ కి ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి నా జీవితాన్ని తొక్కడం స్టార్ట్ చేసింది' అంటూ నితిన్ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక కాలేజీలెవ‌ల్ కి వ‌చ్చేస‌రికి, ఫెయిల‌య్యావ‌ని ఫీల్ అవ్వ‌కూ అంటూ వాట్స‌ప్ పెడుతుంది. ఇది చ‌దివాక‌.. ఇదీ దీని ప‌రామ‌ర్శ అంటూ ఫోన్ విసిరివేయ‌బోతాడు. కానీ స్నేహితులు ఆడ్డుకుంటారు. ఆ త‌ర్వాత సీన్‌లో.. అవునంకుల్ నాకు 95 ప‌ర్సెంట్ వ‌చ్చింద‌ని నితిన్‌ముందే వాళ్ళ‌నాన్న న‌రేష్‌‌కు చెప్ప‌డంతో, వీడిని చ‌దివించే స్తోమ‌త మిడిల్‌క్లాస్ తండ్రికి లేదు అంటాడు. వెంట‌నే.. అప్ప‌ర్‌మిడిల్ క్లాస్ అనిచెప్పావుగ‌ద‌మ్మా? అని క్వ‌శ్చ‌న్ మార్క్ పెడ‌తాడు నితిన్‌. ఇలా స‌ర‌దాగా సీన్లు, సంబాష‌ణ‌లు వుంటాయి. 
 
మ‌రోసీన్‌లో 'పెంట మీద రాయేస్తే మన బట్టలే పడవుతాయి' అని నితిన్ అంటుండగా.. 'పర్లేదు ఇంటికెళ్లి సర్ఫ్ పెట్టుకొని ఉతుక్కుంటా' అంటూ కీర్తి చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది.  ఇలా తనని ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన హీరోయిన్ కి కొన్ని అనుకోని పరిస్థితుల్లో తన వల్లే ప్రెగ్నెన్సీ రావడం.. ఇష్టం లేకున్నా ఆమెనే పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో చోటుచేసునే సంఘటనలు ఈ ట్రైలర్ లో చూపించారు. చివ‌ర్లో.. 'మనల్ని ప్రేమించేవారి విలువ మనం వాళ్ళని ఒద్దు అనుకున్నప్పుడు కాదు.. వాళ్ళు మనల్ని అక్కర్లేదనుకున్నప్పుడు తెలుస్తుంది' 'గొడవ కలవడానికి చెయ్యి.. గెలవడానికి కాదు' వంటి డైలాగ్స్ బాగున్నాయి. 
 
ట్రైలర్ పై దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అసురన్