Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవేషాలు వేసి వేసి, చివరికి ట్రాన్స్‌జెండర్‌గా మారిన జబర్దస్త్ కమెడియన్

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:19 IST)
జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలి కాలంలో ఎక్కువ టిఆర్‌పిలతో దూసుకెళ్తున్న కార్యక్రమాలలో ఇది మొదటి స్థానం సంపాదించుకుంది. ఇందులో పాల్గొన్న వ్యక్తులు కూడా కెరీర్‌లో మంచి స్థాయిలో ఇప్పుడు పలు షోలలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సినది అందులో లేడీ గెటప్స్ వేసే వాళ్ల గురించి. 
 
నిజంగా ఆడవాళ్లు కూడా ఉండనంత అందంగా రెడీ అవుతారు, అలాగే డ్యాన్సులు, హావభావాలు, పంచులతో ప్రేక్షకులందరినీ అలరిస్తున్నారు. లేడీ గెటప్స్‌తో ఎక్కువగా పేరు పొందినవారు వినోద్, పవన్, సాయి తేజ, శాంతి స్వరూప్. వీరు బయట కొన్ని ఫంక్షన్స్‌కు కూడా అదే గెటప్స్‌తో అటెండ్ అవుతుంటారు.
 
సాయి తేజ ఇప్పుడు ఆపరేషన్ ద్వారా పూర్తిగా అమ్మాయిగా మారిపోయాడు. అంతేకాకుండా పేరును కూడా ప్రియాంక సింగ్ అని మార్చుకున్నాడు. ఒక ఇంటర్వ్యూకి వచ్చిన సాయి తేజ ఈ విషయాలన్నీ పంచుకున్నాడు. తాను డబ్బు కోసం ఇలా చేయలేదని, చిన్నప్పటి నుండే తనకు ఈ ఫీలింగ్స్ ఉన్నందున ఇలా చేసానని చెప్పుకొచ్చాడు.
 
నాకు ఐదేళ్ల వయస్సు నుండే ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు మా సిస్టర్ డ్రెస్సులు వేసుకోవడం, వాళ్లలాగా తయారవ్వడం వంటివి చేసేవాడిని. ఈ విషయం చాలా కొద్దిమందికే తెలుసు. మా నాన్నకు ఊర్లో మంచి పేరు ఉండటం వలన ఆ భయంతో ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయాను. కానీ ఇది దాచుకునే విషయం కాదని ఇప్పుడు ధైర్యంగా ఈ విషయాన్ని బయటపెడుతున్నానని చెప్పాడు.
 
అయితే ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్ తర్వాత చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. ఆర్థరైటిస్ కూడా వచ్చింది. ఈ కష్టకాలంలో నా నలుగురు స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు. వాళ్ల వల్లనే నేను చావుకు దగ్గరగా వెళ్లి మళ్లీ బ్రతికాను అని వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments