ఆంధ్రా కుక్కలు చాలా క్రూరంగా మారిపోయాయ్ : ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఆంధ్రా కుక్కలు చాలా క్రూరంగా మారిపోయాయ్ అని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సోమవారం సభలో చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది.
ఆంధ్రా కుక్కలు చాలా క్రూరంగా మారిపోయాయ్ అని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సోమవారం సభలో చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది.
వైజాగ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద పెరిగిపోయిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న 'దోమలపై దండయాత్ర' కార్యక్రమంలాగే కుక్కలపై దండయాత్రను కూడా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు కాబట్టి కుక్కలు వారి ఇళ్ల సమీపానికి రాకపోవచ్చనీ, తనతో సహా సామాన్యులను మాత్రం వెంటపడి మరీ కరుస్తున్నాయని వెల్లడించారు.
ఇపుడు ఆంధ్రాలో ఉన్న కుక్కలు చాలా క్రూరంగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలతో అసెంబ్లీలోని సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి యనమల స్పందించారు. కుక్కల బెడదకు సంబంధించిన వ్యవహారాలను మున్సిపల్ మంత్రిత్వశాఖ చూస్తోందని తెలిపారు. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు.