Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ షో జడ్జిగా కామెడీ రారాజు బ్రహ్మానందం.. అతనితో జత కట్టిన ఐస్ క్రీం బేబీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్స్‌గా ఇంట్లో అడుగుపెట్టిన అందరూ ఏదో ఒక రూపంలో మంచి ఛాన్సులను స్వంతం చేసుకంటున్నారు.

ఆ షో జడ్జిగా కామెడీ రారాజు బ్రహ్మానందం.. అతనితో జత కట్టిన ఐస్ క్రీం బేబీ
, బుధవారం, 3 అక్టోబరు 2018 (14:36 IST)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్స్‌గా ఇంట్లో అడుగుపెట్టిన అందరూ ఏదో ఒక రూపంలో మంచి ఛాన్సులను స్వంతం చేసుకంటున్నారు. హౌస్‌లో గ్లామర్‌ను చూపుతూ, అల్లరి పిల్లగా ఎంతో చలాకీగా అన్ని పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న తేజస్వి మడివాడ, ఆపై తెలిసో తెలీకో చేసిన కొన్ని పనులు, మాట్లాడిన మాటల వలన ప్రేక్షకుల మద్దతు పోగొట్టుకుని ముందుగానే షో నుండి ఎలిమినేట్ అయిపోయింది. 
 
అయితే టైటిల్ బరిలో ఉండకపోయినా, మంచి ఛాన్స్ కొట్టేసింది ఈ ఐస్ క్రీం భామ. తేజస్వి మడివాడ హోస్ట్‌గా త్వరలో టీవీలో ఒక కామెడీ షో ప్రారంభం కానుంది. దీనికి జడ్జిగా కామెడీ రారాజు బ్రహ్మానందం వ్యవహరించనున్నారు. ఇది స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానుంది. ఆమె చలాకీతనం, గ్లామర్ వంటి లక్షణాలను చూసి ఈ షోకి హోస్ట్‌గా ఎంపిక చేసారట నిర్వాహకులు. 
 
ది గ్రేట్ తెలుగు లాఫర్ ఛాలెంజ్ పేరుతో ప్రసారం కానున్న ఈ కామెడీ షో కాన్సెప్టు ఏంటి, కంటెస్టెంట్స్ ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రోమో మాత్రమే ఇప్పటికి విడుదలైంది. నటిగా కెరీర్ మొదలుపెట్టి సరైన బ్రేక్ రాని సమయంలో టీవీ వైపు అడిగులేసి సూపర్ అనే ఛాలెంజింగ్ షో విజేత అయ్యింది. 
 
ఇప్పుడు బిగ్ బాస్ 2లో పాల్గొని టైటిల్ గెలవలేకపోయినా ఈ ఛాన్స్ కొట్టేసింది. అయితే యూ ట్యూబ్‌లో ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుండి ప్రతికూలమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ షో సక్సెస్ అయ్యిందంటే ఇప్పటికే హాట్ హాట్ యాంకర్లుగా ఉన్న రష్మి, అనసూయలకు ధీటుగా మరో యాంకర్ టీవీ పరిశ్రమకు పరిచయమైనట్లే. మరి ఈ ఐస్ క్రీం భామ కూడా ఆ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్మీ నాకు ఇరవై రూపాయలు కావాలి.. ఎందుకు?