Webdunia - Bharat's app for daily news and videos

Install App

సివిల్ సర్వీస్ పరీక్ష -2017.. అగ్రస్థానంలో తెలంగాణ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనుదీప్.. జేడీ కుమారుడు?

సివిల్ సర్వీస్ పరీక్ష -2017 ఫలితాల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దూరిశెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 2017, అక్టోబర్‌-నవంబర్‌ మధ్య నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం సాయ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (11:08 IST)
సివిల్ సర్వీస్ పరీక్ష -2017 ఫలితాల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దూరిశెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. 2017, అక్టోబర్‌-నవంబర్‌ మధ్య నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అనుదీప్ అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. 
 
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌తో పాటు గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపికచేసింది. 
 
ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో అనుదీప్‌తో పాటు 43వ ర్యాంకులో శీలం సాయి, వందో ర్యాంకులో నారపురెడ్డి మౌర్య, 195 ర్యాంకులో వివేక్‌ జాన్సన్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించాడు. ఇక జి. మాధురి - 144, యెడవల్లి అక్షయ్‌ కుమార్‌- 624, భార్గవ శేఖర్‌ - 816 ర్యాంకులు సాధించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments