Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ బక్క ప్రాణం ఏదైనా సేత్తడని భయం... అందుకే వారిద్దరికి వణుకు : కేసీఆర్

దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఫ్రంట్ (ఫెడరల్) ఎంతో అవసరమని వ్యాఖ్యలు చేయగానే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పోశాయని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్

ఈ బక్క ప్రాణం ఏదైనా సేత్తడని భయం... అందుకే వారిద్దరికి వణుకు : కేసీఆర్
, శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (16:40 IST)
దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఫ్రంట్ (ఫెడరల్) ఎంతో అవసరమని వ్యాఖ్యలు చేయగానే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పోశాయని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
 
హైదరాబాద్‌లో జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఇటీవలే ఫెడరల్ ఫ్రంట్ గురించి తాను చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఫ్రంట్‌కు టెంటే లేదని బీజేపీ నేతలు అంటున్నారు. టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే అందరికీ భయం.. కేసీఆర్ మొండి కదా.. అది భయం. కేసీఆర్ ఏదైనా అనుకుంటే చేసి చూపిస్తాడు. అందుకే వారికి భయం అని అన్నారు. 
 
తెలంగాణను ఎట్ల అయితే తెచ్చి చూపిన్నో.. దేశం మంచి కోసం కూడా ఆ విధంగా పని చేస్తాను. ఎవ్వరికీ భయపడను. మీ అందరి సహకారంతో ముందుకు పోతాను. జాతీయ రాజకీయాల్లో తెరాస క్రియాశీలక పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీల అసమర్థత పాలన వల్ల దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. అంతేకాకుండా, ఇన్నాళ్లూ పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయన్నారు. రాష్ట్రాలపైనా కేంద్రం పెత్తనమేంటని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ కేంద్రంగా భూకంపం - దేశంలో రాజకీయ ప్రకంపనలు : కేసీఆర్