Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి ప్రేమ‌క‌థ‌

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (23:30 IST)
హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ, జంటగా కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి, జీవ, జోగి బ్రదర్స్, ప్రధాన పాత్రలలో న‌టిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది. జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆహ్లాదకరమైన గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతుంది.
 
తేజ్ కూరపాటి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తేజ్ కూరపాటికి మంగ‌ళ‌వారంనాడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ .... దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. సినిమా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతొందని తెలిపారు.
 
దర్శకుడు వెంకట్ వందెల మాట్లడుతూ.... హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా సినిమా తియ్యటానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టొరీ ఇది.
 
నటి నటులు:
తనికెళ్ళ భరణి , జీవ, జోగి  బ్రదర్స్ , కల్పనా రెడ్డి, బస్ స్టాప్ కోటేశ్వరావు , డా . ప్రసాద్ , మాధవి , సునీత మనోహర్ , అనంత్ 
 
సాంకేతిక నిపుణులు :
నిర్మాతలు: ముల్లేటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వర రావు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ వందెల
సంగీతం: సందీప్ కుమార్
స్క్రీన్ ప్లే, లిరిక్స్: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి
కెమెరామెన్: వంశీ ప్రకాష్
ఎడిటింగ్: కె.రవికుమార్
కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, నండెపు రమేష్
స్టంట్స్: రామకృష్ణ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments