Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’పోస్టర్ ఆవిష్కరణ

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’పోస్టర్ ఆవిష్కరణ
, సోమవారం, 28 అక్టోబరు 2019 (10:44 IST)
విజయ్ శంకర్, మౌర్యాని జంటగా శివత్రి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ చిత్రం పోస్టర్ ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాకు అపజయమంటూ ఉండదు. ఈ సినిమా టైటిల్ కూడా చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ శంకర్ మంచి అందంగా ఉన్నాడు, నూటికినూరు శాతం సినిమా విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను. అందరూ యంగ్ స్టర్స్ తో సినిమా రూపొందించడం విశేషం’’ అన్నారు.  
 
నిర్మాత పడ్డాన మన్మథరావు మాట్లాడుతూ... సినిమా తాము అనుకున్నదానికన్నా బాగా వచ్చిందని చెప్పారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించామన్నారు. హీరో శ్రీకాంత్ గారు మంచి మనసుతో తమను ఆశీర్వదించారని, ఆయన పేరులోనే సక్సెస్ ఉందని, ఆయన చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించడం తమ విజయానికి మొదటిమెట్టుగా భావిస్తున్నానని అన్నారు. దర్శకుడు వెంకటరమణ ఎస్ మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని చెప్పారు. కథను నమ్ముకునే తాము ఈ ప్రాజెక్టును చేపట్టామని, విజయం తమ సొంతమవుతుందని నమ్ముతున్నామన్నారు.
 
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ... తనకు ఇది మొదటి సినిమా అని చెప్పారు. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరగడం తన అదృష్టమన్నారు. తన కెరీర్ లో ఇదే నిజమైన దీపావళి అన్నారు. సంగీత దర్శకుడు సదాచంద్ర మాట్లాడుతూ ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయని చెప్పారు. అన్ని పాటలు బాగా వచ్చాయని చెప్పారు.
 
హీరో శ్రీకాంత్ స్వయంకృషితో పైకొచ్చిన హీరో అని, ఆయన ఆశీర్వచనాలు తమకు ఉంటాయని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, నటుడు వెంకట గోవిందరావు మాట్లాడుతూ యువతరం నటులతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పారు. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అవుతుందన్నారు.
 
సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ... మంచి కథాంశం ఉంటే విజయం వెన్నంటే ఉంటుందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జి. అమర్ తదితరులు పాల్గొన్నారు. ఈసినిమాలో ఇంకా నాగినీడు, వెంకట గోవిందరావు, శివన్నారాయణ, కోటేశ్వరరావు, రచ్చరవి, సునీత, శిరిరాజ్, చలపతిరావు, సాయిమణి, సుభాష్ రెడ్డి నల్లమిల్లి నటించారు.  కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం వెంకటరమణ ఎస్, నిర్మాత వడ్డాన మన్మథరావు, సంగీతం సదాచంద్ర, కెమెరా జి. అమర్, ఎడిటర్ కె.ఎ.వై. పాపారావు, ఆర్ట్ వి.ఎన్. సాయిమణి, ఫైట్స్ అవినాష్, డ్యాన్స్ స్వామి, స్టిల్స్ శ్రీనివాస్, మాటలు సురేష్, సాహిత్యం చంద్రబోస్, వనమాలి, భాస్కర్ భ‌ట్ల, కాసర్ల శ్యాం, లైన్ ప్రొడ్యూసర్ సంతోష్. ఎస్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పునర్నవి భూపాలం.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది...