Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ దుర్గమ్మ ఆలయంలో తేజ్ టీమ్ ప్ర‌త్యేక పూజ‌లు..!

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రానికి క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ పై కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. తేజ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. ఇట

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (12:11 IST)
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రానికి క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ పై కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. తేజ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టించింది. ఇటీవ‌ల మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజైన ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ... కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. 
 
జూలై 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఆడియో సాధించిన విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని ఆడియో స‌క్స‌స్ మీట్‌ను ఈ రోజు విజ‌య‌వాడ ట్రెండ్ సెట్ మాల్‌లో ఘ‌నంగా జ‌రిపేందుకు ప్లాన్ చేసారు. విజ‌య‌వాడ‌కు చేర‌ుకున్న తేజ్ టీమ్ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
 
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌న్ త‌దిత‌రులు తేజ్ చిత్రం విజయవంతం కావాలని అమ్మవారికి ప్ర‌త్యేక పూజలు చేసారు. మ‌రి... జులై 6న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న తేజ్ సినిమా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments