ప్రశాంత్ వర్మ హను-మాన్ ఆయుధాన్ని చూపిస్తూ టీజర్ తేదీ వెల్లడి

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (15:33 IST)
hanuman weapon
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్, యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజల ఫస్ట్  ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్‌' టీజర్ ని ఈ నెల 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే గత 15వ తేదీన సూపర్‌స్టార్ కృష్ణ గారు కన్నుమూయడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. ఈ రోజు, మేకర్స్ టీజర్ రిలీజ్ కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
 
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హను-మాన్  టీజర్ నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:33 గంటలకు విడుదల కానుంది. హను-మాన్ ఆయుధాన్ని చూపిస్తూ ఓ  అద్భుతమైన పోస్టర్ ద్వారా మేకర్స్  టీజర్ డేట్ ని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో తేజ సజ్జ చేయి కొండపైన గదను ఎత్తడం కనిపిస్తోంది. అతని చేతికి  బ్రాస్‌లెట్‌, రాగి కంకణం , వేలికి రెండు ఉంగరాలు కూడా ధరించాడు. పోస్టర్ టీజర్‌పై క్యూరియాసిటీని మరింత పెంచింది.
 
 అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
 టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది .  మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
 
తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు ప్రాణాలు

జూలై 2027 గోదావరి పుష్కరాలు.. ముందుగానే పోలవరం పూర్తికి శరవేగంగా పనులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అభినవ కృష్ణదేవరాయ బిరుదు ప్రదానం (video)

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments