Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధీర‌ ఫ‌స్ట్‌ స్ట్రైక్‌ని విడుద‌ల చేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్

Advertiesment
అధీర‌ ఫ‌స్ట్‌ స్ట్రైక్‌ని విడుద‌ల చేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్
, బుధవారం, 23 మార్చి 2022 (16:43 IST)
Kalyan Dasari
క్రియేటివ్ ద‌ర్శ‌కుడిగా పేరుపొందిన ప్రశాంత్ వర్మ త‌న చేసే సినిమాల‌తో హీరోల‌ను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్‌కి జాంబి కాన్సెప్ట్‌ని పరిచయం చేసిన తర్వాత, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా `హను-మాన్‌`ని రూపొందిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాగా, మరో హీరోని పరిచయం చేస్తూ మ‌రో సూప‌ర్‌హీరో ఫిలిం చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.  ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ దాసరి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించ‌నున్న ఈ చిత్రానికి `అధీర`పేరు నిర్ణ‌యించారు.
 
భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్ వర్మ, మార్వెల్,  DC వంటి సూపర్ హీరోలను క్రియేట్ చేస్తున్నాడు.  సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్, కథను చెప్పే విధానం ప్రత్యేకంగా వుండ‌బోతోంది.  కళ్యాణ్ టైటిల్ రోల్‌లో కనిపించనున్న ఈ సూపర్ హీరో చిత్రం అధీర ఎంతో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకోనుంది.
 
webdunia
Kalyan with RRR team
గ్రాండ్ గా ఉండేలా డిజైన్ చేసిన `అధీర` పోస్ట‌ర్‌ను ఆర్‌.ఆర్‌.ఆర్‌. త్ర‌యం అయిన ప్ర‌ముఖ‌ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా విడుదల చేశారు. దాంతో అధీర నుంచి వ‌చ్చిన‌ ఫ‌స్ట్‌ స్ట్రైక్  ప్రారంభంలోనే భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంది.
 
ఫ‌స్ట్‌ స్ట్రైక్ చూస్తుంటే,  చిన్న‌ప్ప‌టి నుంచీ అధీర‌కు ప‌వ‌ర్స్ వున్నాయ‌నే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకుంది. విజువ‌ల్స్ గ్రాండియ‌ర్‌గా వున్నాయి. బేక్‌గ్రౌండ్ సంగీతం మ‌రోస్థాయిలో వుంది. వీటిని చూస్తే ప్ర‌శాంత్ వ‌ర్మ కొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేయ‌బోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.
 
ఇతర సూపర్ హీరోలాగే, త‌ను  చెడును నాశనం చేయడానికి, అమాయకులను రక్షించడానికి వున్న‌ట్లు కనిపిస్తుంది.  విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎన‌ర్జీ లెవెల్ పెంచేలా వీడియోలో అధీర‌గా క‌ళ్యాణ్ క‌నిపించాడు. త‌న చేతిలో వున్న‌ ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి,  ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధంను పోలివుంది.
 
‘అధీర ఫస్ట్ స్ట్రైక్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా వుండ‌బోతున్నాయి. ‘అధీర ఫస్ట్ స్ట్రైక్’  ఇప్ప‌టికే సినిమాపై అంచనాలను పెంచుతుంది.
 
కళ్యాణ్ దాసరి ఫేస్ పాక్షికంగా రివీల్ చేయబడింది.  అంద‌మైన లుక్‌తో, త‌గినంత‌ ఎత్తుతో పాత్రలో ఒదిగిపోయాడు.
 
శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే స్క్రిప్ట్స్‌విల్లే.
 
ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరామెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజువల్స్, బిజి.ఎం. పర్ఫెక్ట్ సింక్‌లో వున్న సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు.
 
హను-మాన్‌కి సంబంధించిన అన్ని పనులను ప్రశాంత్ వర్మ పూర్తి చేసిన తర్వాత `అధిర`కు సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.
 
తారాగణం : కళ్యాణ్ దాసరి
 
సాంకేతిక సిబ్బంది:
ర‌చ‌న‌,  దర్శక‌త్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
స‌మ‌ర్ప‌కులు: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
DOP: దాశరధి శివేంద్ర
సంగీతం: గౌరిహరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
PRO: వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో రాజుకున్న వివాదం : నిషేధం విధించాలంటూ ఆందోళనలు