Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

హను-మాన్ నుండి విల‌న్ వినయ్ రాయ్ లుక్‌ విడుద‌ల చేసిన రానా దగ్గుబాటి

Advertiesment
Hanu-Man- Vinay Roy
, బుధవారం, 8 జూన్ 2022 (11:39 IST)
Hanu-Man- Vinay Roy
టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్' షూటింగ్ చివరి దశలో ఉంది. భల్లాలదేవ రానా దగ్గుబాటి ఈ చిత్రం నుండి 'బ్యాడాస్ ఈవిల్ మ్యాన్' మైఖేల్‌ను విడుదల చేశారు.
 
ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన 'బ్యాడాస్ ఈవిల్ మ్యాన్' మైఖేల్..  భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన సైన్యంతో ఫ్లైయింగ్ సాసర్స్ ని తలపించే రోబోటిక్ బ్యాట్స్ నిఘాలో ఒక గుడి ముందు నడుస్తూ రావడం టెర్రిఫిక్ గా వుంది. ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్, పైరేట్ ఐ ప్యాచ్ తో ఈవిల్ మ్యాన్ లా కనిపించిన వినయ్ రాయ్.. తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టారు.
 
బాట్‌మ్యాన్‌కు జోకర్, సూపర్‌మ్యాన్ కు లెక్స్ లూథర్ లాగా హను-మాన్ కు మైఖేల్ సూపర్‌విలన్. ఐతే  మైఖేల్ అందరిలాంటి సూపర్ విలన్ కాదు. మైఖేల్ పాత్రకు గొప్ప క్యారెక్టర్ ఆర్క్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్లు ఉన్నతమైన టెక్నాలజీ అతని సొంతం. అతను ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
 
అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్,  టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తోంది.
 
కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు - అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.
 
తారాగణం: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్  తదితరులు
 
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్,  కృష్ణ సౌరభ్
ఎడిటర్: ఎస్బీ రాజు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈవెంట్ల పేరుతో హీరోయిన్లతో వ్యభిచారం: దోషులుగా నిర్మాత దంపతులు