Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే స‌క్సెస్ - అర్జున ఫ‌ల్గుణ‌ ప్రీ రిలీజ్ లో దిల్‌రాజు

ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే స‌క్సెస్  - అర్జున ఫ‌ల్గుణ‌ ప్రీ రిలీజ్ లో దిల్‌రాజు
, గురువారం, 30 డిశెంబరు 2021 (19:17 IST)
Srivishnu, dil raju and others
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన‌ చిత్రం `అర్జున ఫ‌ల్గుణ‌`. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహించారు. ఈ మూవీ డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు.
 
ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. నిరంజన్, అన్వేష్‌లు సినిమా మీద ఫ్యాషన్‌తో 2008 లో మ్యాట్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ స్టార్ట్ చేశారు. నేను ఎలాగైతే కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ సినిమాలు చేస్తానో వాళ్లు కూడా సేమ్ రూట్‌. ఒక్క క్షణం, ఘాజీ.. ఇప్పుడు అర్జుణ ఫల్గుణ  ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. నిరంజన్, అన్వేష్‌లకు ఆల్ ది బెస్ట్. మనం ఎన్ని సక్సెస్‌లు తీస్తామో తెలియదు.. కానీ ప్రయత్నం చేస్తు వెళ్తుంటే సక్సెస్ వస్తుందని నమ్ముతాను. దాన్నే వాళ్లు కూడా నమ్ముతూ ఇలాగే డిఫరెంట్ సినిమాలు తీస్తున్నారు. అర్జున మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. శ్రీ విష్ణు హీరో అనాలో, ఆర్టిస్ట్ అనాలో, యాక్టర్ అనాలో నాకు తెలియదు. కానీ లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాం. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నం చేస్తూ.. తన ఫర్ఫామెన్స్‌తో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ, కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నాడని తెలిపారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు తేజ మర్ని మాట్లాడుతూ.. అచ్చమైన తెలుగమ్మాయి కావాలంటే నాకు ఎవరూ దొరకలేదు. రెడ్ చిత్రంలో ఆమె లుక్ చూసిన తర్వాత అమృతను ఫిక్స్ చేశాం. చాలా ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ అదరగొట్టాడు. పల్లవి, చరణాలు మాకు అక్కర్లేదు.  శ్రీ విష్ణుకు కథ చెప్పినప్పుడు ఫస్టాఫ్ విన్నాక ఆయనలో ఒక స్పార్క్ కనిపించింది. సెకాండఫ్ చెప్పగానే సినిమా చేస్తున్నానని చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మంచి యాక్షన్, బ్యూటిఫుల్ ఏమోషన్‌తో.. సంక్రాంతి ముందే వచ్చిందని అనుకుంటారని తెలిపారు.
 
హీరోయిన్ అమృత‌ అయ్యర్ మాట్లాడుతూ,  శ్రీ విష్ణుతొ మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించింది. ఆ అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. పక్కన ఉన్న అందరూ చాలా బాగా చేయాలని మోటివేట్ చేస్తుంటారు. మహేష్, చైతన్య.. అంతా ఫ్రెండ్స్ అయ్యారు. ఇది తెలుగులో నా మూడో సినిమా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇయర్ పెద్ద సినిమాతో వస్తాను అన్నారు.
 
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, గోదావరి జిల్లాల్లో మాటల మాదిరిగా అందరితో చెప్పించారు తేజ మర్ని. నేను ఎప్పుడు కథనే  సినిమాగా చేశాను. నా ఫ్రెండ్స్ కామెడీ, ఫ్యామిలీ, బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు చేయమని చెప్పేవారు. మాస్ సినిమాలు వద్దనే వారు. డిసెంబర్ 31 తర్వాత మీరు చెప్పండి నేను మాస్ సినిమాలకు పనికి వస్తానో రానో మీరు నిజాయితీగా చెప్పండి. సినిమాలో మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బయట తేజ జూనియర్‌కు పెద్ద ఫ్యాన్. అందరికి కోస్తే రక్తం వస్తుంది.. కానీ తేజకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. ఆయన పేరు చెబితేనే తేజ ముఖం వెలిగిపోతుంది. ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది.  మల్కల్ లంక అనే ఊరు వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. ఆ ఊరు ఈ సినిమాతో ఫేమస్ అవుతుంది` అన్నారు.
ఇంకా సినిమాటోగ్రఫర్ జగదీష్, ద‌ర్శ‌కులు సాగర్ కే చంద్ర , తిరుమల కిషోర్, వెంకటేశ్ మహా, హసిత్ గోలి,  మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్, వివేక్ ఆత్రేయ. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్,

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలిమై ట్రైలర్ రిలీజ్: విలన్‌గా కార్తికేయ లుక్ అదుర్స్ (video)