Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీజర్ తో ఆక‌ట్టుకున్న‌ అర్జున ఫల్గుణ

టీజర్ తో ఆక‌ట్టుకున్న‌ అర్జున ఫల్గుణ
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:28 IST)
Arjuna Falguna,
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. 
 
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఆచార్యను తెరకెక్కించిన కొరటాల శివ అర్జున ఫుల్గుణ ట్రైలర్‌ను విడుదల చేశారు.
 
డిగ్రీ అయిపోయి తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా తిరిగే పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తున్నారు. ఇక ఆ ఊర్లోని అమ్మాయిగా అమృతా అయ్యర్ ఆ గ్యాంగ్‌లో చేరుతారు. ఆ గ్యాంగ్ అంతా కూడా సినీ అభిమానులుగా కనిపిస్తారు. స్టార్ హీరోల పేర్లతో వారిని వారు పరిచయం చేసుకుంటారు. ఇలా జాలీగా ఉన్న వారి జీవితాల్లోకి అనుకోని ప్రమాదాలు వస్తాయి. అవి ఏంటి? వారిని ఎవరు వెంటాడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున ఫల్గుణ.
 
తేజ మర్ని ఓ కమర్షియల్ సబ్జెక్ట్‌ను ఎంతో ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లో మంచి అనుభూతిని ఇస్తుందని ట్రైలర్‌ను బట్టి చెప్పొచ్చు. శ్రీ విష్ణు ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. అమృతా అయ్యర్ పాత్ర చక్కగా కుదిరింది. సుబ్బరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
 
జగదీష్ చీకటి సినిమాటోగ్రపీ అద్భుతంగా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ కట్టిపడేసేలా ఉంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
 
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి.. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 
 
ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి  (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య  (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాంఛనంగా ప్రారంభమైన గోపీచంద్ 30వ సినిమా