Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నోరు విప్పితే అంతే సంగతులు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తమ్మారెడ్డి

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (17:12 IST)
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు కోసం భారీగా ఖర్చు అయ్యిందని.. ఆ ఖర్చుతో పది సినిమాలు తీయొచ్చునని ప్రముఖ దర్శకనిర్మాత చేసిన వ్యాఖ్యలపై.. మెగాబ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ఆర్ఆర్ఆర్ యూనిట్ అంత ఖర్చు చేసినట్టు నీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా? అని రాఘవేంద్రరావు ప్రశ్నిస్తే.. 'నీ అమ్మ మొగుడు పెట్టాడారా రూ.80 కోట్ల ఖర్చు' అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు. 
 
ఇందుకు తమ్మారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "నేను నోరు విప్పితే, అందరి బాగోతాలు బయటపడతాయి" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను తప్పు చేయలేదని.. అలాంటప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదన్నారు తమ్మారెడ్డి. చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే... అందులో నుంచి ఒక క్లిప్పింగ్ ఆధారంగా తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జక్కన్న రాజమౌళిపై ఈర్ష్యతో అలా మాట్లాడానని అంటున్నారు. 
 
అసలు రాజమౌళి తనకు సమకాలీనుడే కాదని.. ఈ కామెంట్స్ చేసేందుకు రెండు రోజుల ముందు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు చేశానని గుర్తు చేశారు. ప్రశంసించినప్పుడు ఎందుకు పట్టించుకోలేదంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు. తనకు లెక్కలు తెలియనక్కర్లేదు కానీ.. తనకు చాలామంది అకౌంట్స్ తెలుసునని హెచ్చరించారు. 
 
అవార్డులు పదవుల కోసం ఎవరెవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అన్నీ తనకు తెలుసునని.. వాటి గురించి తానిప్పుడు మాట్లాడనని చెప్పారు. తాను అవన్నీ మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుందని చెప్పుకొచ్చారు. తల్లిలాంటి ఇండస్ట్రీని గౌరవిస్తానని.. అందుకే సంయమనంతో మాట్లాడుతున్నానని వెల్లడించారు. 
 
తనకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసని.. ఎక్కడైనా నిజాలు మాట్లాడగలనని.. ఎవరు నీచంగా మాట్లాడినా పట్టించుకోనని తెలిపారు. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే.. తిరిగి మొహం మీదే పడుతుందని చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

క్రైస్తవుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది : డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments