Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్క సుష్మిత కొణిదెల ఆశీస్సులు తీసుకున్న తమ్ముడు ప్రశాంత్‌

Advertiesment
Sushmita Konidela, Director Prashant
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (20:05 IST)
Sushmita Konidela, Director Prashant
మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా పలు ప్రాజెక్ట్‌లు చేస్తుంది. ఆమధ్య వెబ్‌ సిరీస్‌ చేసింది కూడా. తాజాగా శ్రీదేవి శోభన్‌బాబు అనే సినిమాను తన భర్త విష్ణుప్రసాద్‌తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రశాంత్‌ దర్శకుడు. ఆయన సుష్మితగారిని అనుకోకుండా జూబ్లీహిల్స్‌లోని కాఫీషాప్‌లో కలిశాడట. ఆ వివరాలు చెబుతూ, నేను ఓ రోజు కాఫీషాప్‌కు వెళ్ళాను. అక్కడ సుష్మితగారు తన ఇద్దరు కుమార్తెలతో ఓ టేబుల్‌ దగ్గర వున్నారు. నేను, సంతోష్‌ కలిసి కాఫీ షాప్‌కు వచ్చాం. సుష్మితగారిని చూడగానే ఒక్కసారిగా చిరంజీవిగారు గుర్తుకువచ్చారు.

అంత పెద్ద స్టార్‌ కూతురు ఎలాగైనా మాట్లాడాలని ధైర్యం చేసి ఆమె టేబుల్‌ దగ్గరకు వెళ్లి సుష్మిత అక్క అని అన్నాను. నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే మీరు నాకు అక్క అవుతారని చెప్పగానే. నేను దర్శకుడిని అవ్వాలని కథ రాసుకున్నాను అని చెప్పాను. ఆమె చాలా కాజువల్‌గా నా ఫోన్‌ నెంబర్‌ తీసుకుంది. ఆ వెంటనే నేను వచ్చేశాను. ఆ తర్వాత అరె.. అక్క నెంబర్‌ తీసుకోలేదే! అని ఆలోచించాను. ఈ విషయం గమనిస్తున్న సంతోష్‌, మరో స్నేహితుడు ఏంటి ఇంతడేర్‌గా వెళ్ళి మాట్లాడావ్‌! అని నన్ను అడిగారు. ఇదంతా చిరంజీవిగారి స్పూర్తి అన్నాను.. అని చెప్పారు.
 
ఆ తర్వాత కట్‌ చేస్తే శ్రీదేవి శోభన్‌ బాబు సినిమాకు దర్శకుడిగా ఆఫర్‌ వచ్చింది. అక్క గర్వపడేలా సినిమా చేశానంటూ ప్రీరిలీజ్‌లో మాట్లాడారు. ఫైనల్‌గా సుష్మిత స్పందిస్తూ.. ప్రశాంత్‌ లాంటి తమ్ముడు నాకు దొరకడం చాలా ఆనందంగా వుంది. మనం ఇంటిలో ఎలా ఉంటామో, మహిళలు ఎలా బిహేవ్‌ చేస్తారో ఈ  సినిమాలో చూపించారు. కుటుంబంతో హాయిగా చూసే సినిమాగా మలిచాడు. సోదరుడు ప్రశాంత్‌ మరలా మా బేనర్‌లోనే సినిమాలు చేయాలి అని అన్నారు. ఆ వెంటనే దర్శకుడు ప్రశాంత్‌ అక్క సుష్మిత కాళ్ళకు నమస్కరిస్తూ ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో లవ్ స్టోరీ చేయాలనుంది : గౌరి జి కిష‌న్