Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (11:04 IST)
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సినీ నటి తమన్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆమె వద్ద ఈడీ అధికారులు గౌహతి కార్యాలయంలో ఏకంగా 8 గంటల పాటు విచారించారు. హెచ్.పి.జడ్ టోకెన్ యాప్‌లో పలువురు ఇన్వెస్ట్ చేసి మోసపోయారని యాప్‌పై కేసులున్నాయి. ఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరైందని, అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలపై ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమె హాజరై ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హెచ్పీజెడ్ టోకెన్ మొబైల్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరిట ఇన్వెస్టర్లను హెచ్.పి.జడ్ టోకెన్ మొబైల్ యాప్ మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ యాప్ నిర్వాహకాన్నీ తేల్చే పనిలో ఉంది. హెచ్.పి.జడ్ టోకెన్ మొబైల్ యాప్‌కు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఈడీ ప్రశ్నిస్తోంది.
 
అందులో భాగంగానే ప్రముఖ నటి తమన్నాను గురువారం ఈడీ అధికారులు గౌహతి కార్యాలయంలో విచారించింది. ఈడీ అధికారులు తమన్నా నుండి వాంగ్మూలం సేకరించారు. హెచ్.పి.జడ్ టోకెన్ మొబైల్ యాప్ లో ఎవరైనా రూ.57 వేల పెట్టుబడి పెడితే మూడునెలల పాటు రోజుకు రూ.4వేల రూపాయలు తిరిగి ఇస్తామని నిర్వాహకులు భారీ ఈవెంట్స్ వంటివి పెట్టి కస్టమర్స్‌ను నమ్మించారు. 
 
అలా ఈ అప్లికేషన్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరై యాప్‌ను ప్రమోట్ చేశారు. దీంతో ఈ యాప్‌లో భారీగా డబ్బులు పెట్టారు. అలా నమ్మి పెట్టుబడి పెట్టిన వారికి ఒక నెల డబ్బులు చెల్లించి నమ్మకం కలిగేలా చేసి ఆ తర్వాత నెల నుండి ఏవో సాకులు చెప్తూ డబ్బులు చెల్లించడం ఆపేసారు. నిందితులు పెట్టుబడిదారులను మోసం చేసేందుకు 'హెచ్పీజెడ్ టోకెన్' మొబైల్ ఫోన్ అప్లికేషను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈడీ దాడులు నిర్వహించి రూ.455 కోట్ల విలువైన స్థిరాస్తులు, డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో తమన్నా భాటియా చిక్కుల్లో పడ్డారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments