Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ చెప్పిన త‌మ‌న్నా- వెన్నెనొప్పి వున్నా డాన్స్ చేశాడు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (13:46 IST)
Tamanna ph
మిల్కీబ్యూటీ త‌మ‌న్నా సీటీమార్ సినిమాలో న‌టించింది. క‌బ‌డ్డీ కోచ్‌గా న‌టించింది. మ‌రో టీమ్‌కు కోచ్‌గా గోపీచంద్ న‌టించాడు.ఇద్ద‌రూ ల‌వ్ లో ఎలా ప‌డ్డార‌నేది సినిమా. ఈ సినిమా ఇటీవ‌లే విడుద‌లైంది. త‌మ‌న్నా సక్సెస్‌మీట్ త‌న ఆనందాన్ని ఇలా పంచుకుంది. 
 
2019లో ‘సీటీమార్‌’ సినిమాను స్టార్ట్ చేశారు. త‌ర్వాత ప్యాండమిక్ వ‌ల్ల చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. అన్నీ స‌మ‌స్య‌లు త‌ర్వాత ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తీయాల‌నే కోరిక ఈ స‌క్సెస్‌కు కార‌ణం. సంప‌త్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి క‌థ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పే ద‌ర్శ‌కుడు సంప‌త్‌గారు. ఇది మ‌రోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సినిమాలో 24 మంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ మూవీలో క‌బ‌డ్డీ ఆడిన అమ్మాయిలు ఎంత హార్డ్ వ‌ర్క్ చేశారో చూశాను. 
 
ఈ సినిమా కోసం గోపీచంద్‌ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. జ్వాలారెడ్డి సాంగ్‌లో వెన్ను నొప్పి ఉన్నా కూడా గోపీచంద్‌ అద్భుతంగా డాన్స్ చేశారు. నిర్మాత‌లు శ్రీనివాస్‌, ప‌వ‌న్‌గారికి థాంక్స్‌. ప్యాండ‌మిక్ టైమ్ త‌ర్వాత షూటింగ్స్ స్టార్ట్ కావ‌డంతో సినిమా ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రు కాలేక‌పోయాను. అందుకు నిర్మాత‌ల‌కు సారీ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా స‌క్సెస్ నాకెంతో ముఖ్యం. వినాయ‌చ‌వివితో పాటు సీటీమార్ హ‌వా కూడా న‌డుస్తుంది. అంద‌రూ ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments