స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - కె.సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. కొద్ది రోజుల ముందు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, తాజాగా కాకినాడ పోర్ట్ లోపల షూటింగ్ చేస్తున్నారు.
దీంతో హీరో అల్లు అర్జున్ కాకినాడలో తెగ సందడి చేస్తున్నాడు. "పుష్ప" సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన రెండు రోజుల పాటు కాకినాడలోనే ఉండనున్నాడు. బన్నీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు వచ్చారు. టీ షర్ట్, షార్ట్స్‌లో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించి అందరిని పలకరించాడు.
ఇకపోతే, కాకినాడలోఖాళీసమయంలో బన్నీ.. 'సీటీమార్' సినిమా చూసేందుకు పద్మప్రియ థియేటర్‌కి వెళ్లారు. మ్యాట్నీ సినిమా చూసిన బన్నీ సినిమా తనకి నచ్చిందంటూ ట్వీట్ చేశారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.