Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ తాప్సీ ప్రియుడు అతడే... బహిర్గతం చేసిన హీరోయిన్

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (13:58 IST)
హీరోయిన్ తాప్సీ తన ప్రియుడి పేరును బహిర్గతం చేసింది. పేరు మాథిస్. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు. అతనితో చాలా యేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు ఆమె తాజాగా వెల్లడించింది. పైగా, గత దశాబ్దకాలంగా తాను అతనివల్ల ఎంతో సంతోషంగా ఉన్నట్టు వెల్లడించింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో 'ఝుమ్మంది నాదం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్పీ... తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన తాప్సీ... బాలీవుడ్‌లో సైతం పలు చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి టాలెంటెడ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది.
 
మరోవైపు తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోతో ప్రేమలో ఉందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ప్రేమ గురించి పలు విషయాలను వెల్లడించింది.
 
మాథిస్ బోతో తాను దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని వెల్లడించింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయంలో అతనితో పరిచయం ఏర్పడిందని... ఇన్నేళ్లుగా తమ బంధం బలపడుతూ వచ్చిందని తెలిపింది. 
 
అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని... అందుకే తమ ప్రేమ గురించి ఇప్పటివరకు తాను ఎక్కడా మాట్లాడలేదని చెప్పింది. మాథిస్ వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments