Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'లవ్ గురు'గా మారిపోయిన పాకిస్తాన్ ప్రధాని.. 82 యేళ్ల వయుసులో కూడా..

anwaar ul haq
, బుధవారం, 3 జనవరి 2024 (11:27 IST)
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈయన ఇపుడు లవ్ గురుగా మారిపోయారు. 82 యేళ్ల వయసులోనూ వివాహం చేసుకోవచ్చని చెబుతున్నాడు. 52 యేళ్ల వ్యక్తి తనకు నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా అని ఓ పౌరుడు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానిచ్చారు. 
 
82 యేళ్ల వయుసులోనూ పెళ్లిని పరిగణించవచ్చన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు పౌరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా సమాధానాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన జీవితంలో ఎవరినీ ఆకర్షించడానికి ప్రయత్నించలేదని, అయితే తాను చాలా మందిని ఆకట్టుకున్నానని చెప్పారు. డబ్బులేని వారు ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏంచేయాలని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. 
 
ప్రేమ ఒక అవకాశంగా దొరుకుతుంది. ఉద్యోగం సామర్థ్యాన్ని బట్టి లభిస్తుంది. కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు అంట ప్రేమకే మద్దతిచ్చారు. ఇక పిచ్చి అత్తగారు దొరికితే ఏం చేయాలని మరొకరు ప్రశ్నించగా, విపత్తు నిర్వహణ కోర్సులో చేరాలని సరదాగా సమాధానమిచ్చారు. కాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయిన పాకిస్థాన్‌కు అన్వర్ ఉక్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. వచ్చే నెల ఎనిమిదో తేదీన పాకిస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల తర్వాత పాకిస్థాన్ దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రక్కును ఢీకొన్న బస్సు.. 12మంది మృతి.. 25మందికి గాయాలు