మరో బాలీవుడ్ నటి కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చారు. ఆమె ఎవరో కాదు. హీరోయిన్ ఇషా కొప్పికర్. టిమ్మీ నారంగ్ అనే వ్యాపారవేత్తను 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇషా... తమ 14 యేళ్ల వైవావిహక బంధానికి బ్రేకప్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె నిర్ణయం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
1997లో వచ్చిన "వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్" అనే చిత్రంలో నటించిన ఆమె... 1998లో "చంద్రలేఖ" సినిమాతో పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 2009లో టిమ్మీ నారంగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రియానా (9) అనే కుమార్తె కూడా ఉన్నారు.
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తమ బంధాన్ని నెలబెట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరలేదు. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా... మోడల్‌గా రాణించారు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించారు. 1995లో మిస్ ఇండియా పోటీల్లో మిస్ టాలెంట్ క్రౌన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. 2000లో హృతిక్ రోషన్ ఫిజా చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 2002లో రామ్ గోపాల్ వర్మ కంపెనీ సినిమాలో ఖల్లాస్ అనే ఐటమ్ సాంగ్‌తో బాగా పాపులర్ అయ్యారు.