Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమానం పెనుభూతమై... భార్యను కత్తితో పొడిచి చంపి.. భర్త ఆత్మహత్య... ఎక్కడ?

Advertiesment
ramalakshmi
, సోమవారం, 25 డిశెంబరు 2023 (09:13 IST)
అనుమానం పెనుభాతమైంది. కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త... తాను కూడా పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలోని గుడివాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుడివాడ పట్టణం ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన విష్ణుమూర్తుల వెంకన్న రెండో కుమార్తె రామలక్ష్మికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని అప్పన్నపేటకు చెందిన తాతపూడి సూర్యనారాయణతో గత 2017 మే 24న వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గత యేడాది నుంచి సూర్యనారాయణ(30) భార్యను అనుమానిస్తుండడంతో ప్రశాంతంగా సాగుతున్న వారి కాపురంలో చిచ్చు చెలరేగింది. తరచూ భార్యను కొడుతుండడంతో ఆమె పుట్టింటికి రావడం, వారు పెద్దలతో సర్దిచెప్పి మళ్లీ కాపురానికి పంపించడం ఇలా సాగిపోతుంది. 
 
అయినప్పటికీ సూర్యనారాయణ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భర్త పెడుతున్న వేధింపులు తాళలేని రామలక్ష్మి(26) ఈ యేడాది ఆగస్టులో ఏలూరు జిల్లా గణపవరం పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింటికి వచ్చేసింది. సూర్యనారాయణ వస్తే మాట్లాడి పంపుదామని రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. 
 
ఈ క్రమంలో రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆదివారం పనులకు వెళ్లగా ఇంటి వద్ద ఎవరూ లేరని తెలుసుకొని భర్త సూర్యనారాయణ వచ్చాడు. ఆమె తండ్రి వెంకన్న మరుగుదొడ్డిలో ఉండగా సూర్యనారాయణ పదునైన కత్తితో రామలక్ష్మిపై దాడి చేసి విచక్షణారహితంగా 12 సార్లు పొడిచాడు. ఆమె ఆర్తనాదాలకు తండ్రి వెంకన్న వచ్చి తన కూతుర్ని చంపకంటూ కేకలు వేశాడు. దీంతో అతనిపై కూడా కత్తితో దాడి చేశాడు.
 
అప్పటికే రామలక్ష్మి చంక కింద భాగంలో పొడవడం వల్ల ఆమె కుప్ప కూలిపోయింది. వెంటనే స్థానికుల 108 సాయంతో ఇద్దరినీ గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేసమయంలో సూర్యనారాయణ కలుపు నివారణ మందు తాగేశాడు. అతడ్ని కూడా స్థానికులు 108 ఆంబులెన్స్‌ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు... మరదలిని సజీవన దహనం చేసిన అన్న