Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఆధ్వర్యంలో మొగల్తూరులో కృష్ణంరాజు పేరుతో ఉచిత వైద్య శిబిరం

డీవీ
శుక్రవారం, 19 జనవరి 2024 (09:33 IST)
A free medical camp Mughaltur
రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణం రాజు గారు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వైద్య శిబిరంలో జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ పాల్గొంటారు.
 
ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్ తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని శ్యామలాదేవి తెలిపారు.  మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలి ఆమె సూచించారు.
 
ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ - కృష్ణం రాజు గారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం. అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments