Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'లో ఒక్క యుద్ధ సన్నివేశానికి రూ.75 కోట్లు.. మొత్తం బడ్జెట్ ఎంత?

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:13 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఏ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మించారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతిలు నటించారు. 
 
ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. కొద్ది రోజుల క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. 
 
భారీ బ‌డ్జెట్ చిత్రంగా సైరా రూపొంద‌గా, ఈ ప్రాజెక్ట్ కోసం రూ.280 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింద‌ని అంతర్గత చర్చ. చిరంజీవి రెమ్యున‌రేష‌న్ కాకుండా అంత మొత్తం ఖర్చు చేసార‌ని చెబుతుండ‌గా, సినిమా లాభాల‌లో మెగాస్టార్ వాటా పుచ్చుకుంటాడ‌ని అంటున్నారు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలోని ఓ యుద్ధం సన్నివేశాన్ని జార్జియా అడవుల్లో చిత్రీకరించారు. ఈ ఒక్క సన్నివేశం కోసం రూ.75 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ యుద్ధం సన్నివేశం ఖర్చుపెట్టిన మొత్తంతో కలుపుకుని రూ.280 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. 
 
కాగా, ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జ‌ర‌గ‌గా, పెట్టిన ఖ‌ర్చు మొత్తం రెండు మూడు రోజుల‌లో నిర్మాత‌లు పొందుతార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి లాభాలు పొందుతారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments