అల‌.. వైకుంఠ‌పుర‌ములో.. రిలీజ్ డేట్ ఫిక్స్.

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం అల..వైకుంఠ‌పుర‌ములో. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల అవుతుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తార‌ని టాక్‌.
 
ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టైటిల్ ప్రొమో, పోస్ట‌ర్ అన్నీ సినిమా పై అంచ‌నాల‌ను తీసుకువ‌చ్చాయి. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుంది. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్, ఎస్‌.రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
 
 
ఓ కోటీశ్వ‌రుడి బిడ్డ పేద‌వాడుగా, పేద‌వాడి కొడుకు కోటీశ్వ‌రుడిగా పెరుగుతారు. త‌ద‌నంత‌ర ప‌రిస్థితులు ఎలా మారుతాయ‌నేదే ఈ సినిమా క‌థాంశమ‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి.. సంక్రాంతికి వ‌చ్చే బ‌న్నీ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడో..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో ?   చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments