Webdunia - Bharat's app for daily news and videos

Install App

దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపించాలి: శ్వేతారెడ్డి (video)

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (16:13 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జునపై టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బిగ్ బాస్ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జునపై శ్వేతారెడ్డి తీవ్రపదజాలంతో కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోపై ఇంత మంది అమ్మాయిలు ఆరోపిస్తున్నా నాగార్జున ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. 
 
'మన్మథుడు2' సినిమా ప్రమోషన్ కోసం ఆసక్తి చూపుతున్న నాగార్జున... తమ ఆరోపణలపై స్పందించకుండా మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించింది. టాస్క్‌ల పేరిట బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌లను మానసికంగా వేధిస్తున్నారని మండిపడింది. 
 
నాగార్జునకు సామాజిక బాధ్యత లేదని ఫైర్ అయ్యింది. దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపించాలని శ్వేతారెడ్డి సవాల్ విసిరారు. వారిద్దరినీ బిగ్ బాస్ షోకు పంపి డబ్బులు సంపాదించుకోవాలంది. 
 
నాగార్జున దొంగలా దాక్కుంటున్నారని... తప్పు చేయకపోతే బయటకు వచ్చి స్పందించాలని డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? అని ప్రశ్నించింది. మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు కదా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు జరిగింది.. క్షమించండి.. అభిమానులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments