Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు కోసం ఏమైనా చేస్తావా నాగ్? అయితే, అమల - సమంతలను హౌస్‌కు పంపిండి...

Advertiesment
డబ్బు కోసం ఏమైనా చేస్తావా నాగ్? అయితే, అమల - సమంతలను హౌస్‌కు పంపిండి...
, శుక్రవారం, 2 ఆగస్టు 2019 (16:06 IST)
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునపై జర్నలిస్టు శ్వేతారెడ్డి మండిపడ్డారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా అంటూ నాగార్జునను నిలదీశారు. పైగా, డబ్బే ముఖ్యమనుకుంటే.. మీ భార్య అమల, కోడలు సమంతలను బిగ్‌బాస్ హౌస్‌కు పంపించాలని ఆమె డిమాండ్ చేశారు. అపుడు మరింత ఎక్కువగా వస్తాయని వ్యాఖ్యానించింది.
 
ప్రస్తుతం బిగ్ బాస్ 3 రియాల్టీ షో ప్రముఖ చానెల్‌లో ప్రసారమవుతోంది. దీనికి హోస్ట్‌గా ప్రముఖ నటుడు నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ బిగ్ బాస్ ఓ బ్రోతల్ హౌస్ అనీ, అవకాశాల పేరుతో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందంటూ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, బిగ్ బాస్‌పై అనేక మంది అమ్మాయిలు పలు రకాలైన ఆరోపణలు చేస్తున్నా నాగార్జున ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఆయనకు రవ్వంత కూడా సామాజిక బాధ్యత లేదన్నారు. 
 
అలాగే, నాగార్జున తన తాజా చిత్రం "మన్మథుడు-2" చిత్రంపై చూపిస్తున్న ప్రమోషన్‌పైనే అమితాసక్తిని చూపుతున్నారంటూ మండిపడ్డారు. పైగా, డబ్బే ప్రధానమనుకుంటే అమల, సమంతలను బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించాలని శ్వేతారెడ్డి సవాల్ విసిరారు. 
 
నాగార్జున ఓ దొంగలా దాక్కుంటున్నారనీ, ఆయన ఎలాంటి తప్పు చేయకపోతే తాము చేస్తున్న ఆరోపణలపై స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. డబ్బు కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని శ్వేతారెడ్డి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైవాహిక బంధాన్ని తెంచుకున్న కె.రాఘవేంద్ర రావు కొడుకు - కోడలు నిజమా?