Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sushanth: రెండు డిఫరెంట్ లుక్‌లలో సుశాంత్ అనుమోలు కొత్త సినిమా పోస్టర్

దేవీ
మంగళవారం, 18 మార్చి 2025 (16:06 IST)
Sushanth Anumolu New look
సుశాంత్ అనుమోలు తన ప్రాజెక్టులతో చాలా సెలెక్టివ్‌గా ఉన్నారు. తన 10వ మూవీ #SA10ని సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అదికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ చిట్టేటి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సంజీవని క్రియేషన్స్ బ్యానర్‌పై వరుణ్ కుమార్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా అనౌన్స్ మెంట్ ని స్ట్రైకింగ్ పోస్టర్ ద్వారా చేశారు. పోస్టర్ లో సుశాంత్ రెండు డిఫరెంట్ లుక్‌లలో ఆసక్తిని పెంచారు. పోస్టర్ పై భాగంలో అతను స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. నేలపై పుర్రెలతో చుట్టుముట్టబడి, పిల్లి అతనిని చూడటం టెర్రిఫిక్ గా వుంది. 
 
దీనికి డిఫరెంట్ గా పోస్టర్ దిగువ బాగం వుంది. ఇది హీరో క్యారెక్టర్ మరో కోణాన్ని ప్రజెంట్ చేస్తోంది. ఇక్కడ సుశాంత్ ఎమోషనల్ గా గర్జిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అతను పోషించే పాత్ర వెర్సటైల్ నేచర్ ని సూచిస్తుంది.
 
పోస్టర్ సూచించినట్లుగా, #SA10 సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్, దీనిలో సుశాంత్ ఎక్సర్సిస్ట్ పాత్రను పోషిస్తాన్నారు. ఇది తెలుగులో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఈ పాత్ర కోసం సుశాంత్ మేకోవర్ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
 
ఈ చిత్రానికి అనిరుధ్ కృష్ణమూర్తి స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు, దర్శకుడు పృథ్వీరాజ్ చిట్టేటితో కలిసి డైలాగ్స్ అందించారు. వైవిబి శివ సాగర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్. సినిమా గురించి మరిన్ని ఆసక్తిరమైన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

Delivery Boy: డెలివరీ పర్సన్‌‌తో సహజీవనం చేసిన మైనర్ బాలిక.. తర్వాత ఏమైందంటే?

Raja Singh: నేను స్వతంత్ర ఎమ్మెల్యే... స్వేచ్ఛగా మాట్లాడగలను.. రాజా సింగ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు - అక్టోబర్ వరకు రిజర్వ్‌లో తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments