Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నప్పలో విష్ణు మంచు, ప్రభాస్ పోరాట సన్నివేశాలు

Advertiesment
Kannappa- vishnu

డీవీ

, బుధవారం, 29 జనవరి 2025 (15:55 IST)
Kannappa- vishnu
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాను ఇటీవల కొందరి ప్రముఖులకు చూపించారు. అందులో రచ్చ రవి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వున్నారు. ఈ సినిమా తిలకించిన తర్వాత మంచు విష్ణు కారణజన్నుడిగా పోల్చారు. ఈ సినిమా కోసమే ఆయన పుట్టాడడనీ,  కన్నప్ప సినిమా చేయడం పూర్తజన్న సుక్రుతం గా పోల్చారు. ఈ ఫీడ్ బ్యాక్ వున్న మంచు మోహన్ బాబు ఆనందంలో వున్నాడు.
 
Kannappa- Prabhas
ఇక సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 3న ప్రభాస్ లుక్ బయటకు వస్తోందని విష్ణు మంచు సోమవారం ప్రకటించారు. ప్రీలుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా హైక్లాస్ గ్రాఫిక్స్, ప్రొడక్షన్ వాల్యూస్‌తో విజువల్‌గా సాగుతుందని చెప్పారు.
 
ఇక ఇందులో ప్రత్యేక విషయం ఏమంటే, ప్రభాస్ శివుడిగా నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ శివ భక్తుడిగా ఓ పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రకారం ప్రభాస్ పాత్ర నిడివి 15 నిమిషాలు ఉంటుంది. "ప్రభాస్, విష్ణుల మధ్య పెద్ద యాక్షన్ ఎపిసోడ్ వుంటుంది. భక్తుడికీ, భగవంతుని దూతకు మధ్య జరిగే పోరాటం హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది" అని విశ్వసనీయ సమాచారం. ప్రభాస్ కేవలం చిన్న పాత్ర అనుకున్నారు. కానీ అభిమానులు మెచ్చేలా ఆయన పాత్ర వుంటుందని తెలుస్తోంది.
 
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశం, దుబాయ్, యుకె, యుఎస్‌ఎలలో వందలాది మంది టీమ్ పనిచేశారు. ప్రధానంగా గ్రాఫిక్ వర్క్,  3డి లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేమ్ ఛేంజర్ నష్టాలను రామ్ చరణ్ రికవరీ చేస్తున్నాడా?