Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

Advertiesment
raag mayur

మురళి

, సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (19:50 IST)
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అదే రోజు రిలీజ్ అయిన ''గాంధీ తాత చెట్టు'' సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘సివరపల్లి’ వెబ్ సిరీస్‌లో హీరోగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్‌గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో భిన్నమైన స్క్రిప్స్ ఎంచుకుంటూ దూసుకు వెళ్తున్నాడు. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 
 
నిజానికి రాగ్ మయూర్ తాను చేసిన మొదటి సినిమా ‘సినిమా బండి’లో మరిడేష్ బాబు అనే పాత్రతో ఒక్కసారిగా మెరిశాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటన, కామిక్ టైమింగ్, నేచురల్ గా అనిపించగా సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత రాగ్ మయూర్ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. భిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్‌గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. 
 
అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ రాగ్ మయూర్ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సివరపల్లి సిరీస్ లో అసలు ఏమాత్రం ఉద్యోగం ఇష్టం లేకుండా చేసే పంచాయితీ సెక్రటరీ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. మరోపక్క 'గాంధీతాత చెట్టు' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. భవిష్యత్తులో సినిమా బండి దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ‘పరదా’ సినిమాతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘గరివిడి లక్ష్మి’ అలాగే ఇంకా పేరు ఫిక్స్ చేయని గీతా ఆర్ట్స్ 2 సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?