Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ మృతికి సోదరీమణులు ఇచ్చిన మందులే కారణమా?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (08:51 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సరికొత్త సందేహం ఇపుడు తెరపైకి వచ్చింది. ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడితో బాధపడుతూ వచ్చిన సుశాంత్‌కు ఆయన సోదరీమణులు ప్రియాంకా సింగ్, మీతూ సింగ్‌లు కొన్ని రకాల మందులు ఇచ్చారు. వీటి కారణంగా కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న సందేహం ఇపుడు తెరపైకి వచ్చింది. 
 
ఈ ఆరోపణతో ఫిర్యాదు చేసిన సుశాంత్‌ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి.. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను సమర్పించిందని, ఆ మేరకే తాము కేసు నమోదు చేశామని బాంబే హైకోర్టుకు తెలిపారు. సుశాంత్‌ సోదరీమణులు ప్రియాంకా సింగ్‌, మీతూ సింగ్‌లపై కేసు పెట్టడాన్ని సీబీఐ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 
 
కాగా, సుశాంత్‌ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకంటూ ప్రియాంక, మీతూసింగ్‌ వాట్సాప్‌ ద్వారా 3 రకాల మందుల పేర్లను పంపారని, అయితే వైద్యుడు పరీక్షించకుండానే ఇచ్చిన ఆ మందులు ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పేలా ప్రభావం చూపి ఉంటాయని రియా చక్రవర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, సుశాంత్‌కు, ఆయన సోదరీమణులకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను కోర్టుకు సమర్పించి.. వారిపై నమోదైన కేసును కొట్టివేయొద్దంటూ కోర్టును రియా చక్రవర్తి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments