Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకంపనలు రేపుతున్న సుశాంత్ ఆత్మహత్య - రియా చక్రవర్తి బ్రదర్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:32 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. కూపీలాగగా బాలీవుడ్‌లోని డ్రగ్ మాఫియా మూలాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు నటి రియా చక్రవర్తికి మాదకద్రవ్య వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్టు తేలింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. 
 
ఈ క్రమంలో రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ చక్రవర్తిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో శామ్యూల్ మిరాండాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియాను, ఆమె తండ్రిని కూడా సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఎన్‌సీబీ అధికారులు కూడా ప్రశ్నించారు.  
 
జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడో రేపో రియాను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, సుశాంత్ ఆత్మహత్య కేసు ఇపుడు అనేక మలుపులు తిరిగి చివరకు డ్రగ్స్ దందావైపు టర్న్ తీసుకుంది. డ్రగ్స్‌ కోణం బయట పడిన తర్వాతే ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యింది. తొలుత ముంబై పోలీసులతో మొదలైన ఈ కేసు విచారణలో.. సీబీఐ, ఈ, ఎన్‌సీబీ కూడా ఎంటరయ్యింది. వీటి వెనుక అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments