Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరో సినిమాలో అక్కినేని హీరో న‌టిస్తున్నాడా..?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (14:16 IST)
మెగా హీరో సినిమాలో అక్కినేని హీరో న‌టిస్తున్నాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. న‌మ్మ‌లేక‌పోతున్నారా..? కానీ.. ఇది నిజంగా నిజం. అయితే.. ఆ మెగా హీరో అల్లు అర్జున్ అయితే... అక్కినేని హీరో సుశాంత్. అవును కాళిదాసు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ క‌రెంట్, అడ్డా చిత్రాల‌తో ఆక‌ట్టుకుని చి ల సౌ సినిమాతో విజ‌యం సాధించాడు. 
 
ఈ సినిమా వ‌చ్చి దాదాపు సంవ‌త్స‌రం అవుతుంది. నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేయ‌నున్నాడా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటే... బ‌న్నీ సినిమాలో న‌టిస్తున్నాను అని చెప్పి షాక్ ఇచ్చాడు. 
ట్విట్ట‌ర్లో సుశాంత్ స్పందిస్తూ... అల్లు అర్జున్ 19వ చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ రోజు షూటింగ్‌లో పాల్గొన్నాను. నా అభిమాన ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన త్రివిక్ర‌మ్ గారు, బ‌న్నీ, ట‌బు గారు, పూజాల‌తో వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. 
 
ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. చిలసౌ త‌ర్వాత నేను చేస్తోన్న మ‌రో సాహ‌సం ఇది. ఈ అమేజింగ్ టీమ్ ద‌గ్గ‌ర చాలా ఎన్నోవిష‌యాలు నేర్చుకుంటాను అనే న‌మ్మ‌కం ఉంది. 
 
అయితే... ఇందులో త‌న పాత్ర ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చెప్ప‌న‌న్నారు. చి ల సౌ విజ‌యం త‌ర్వాత హీరోగా మ‌రో సినిమా చేయ‌కుండా బ‌న్నీ సినిమాలో న‌టించ‌డం అంటే... నిజంగా సాహ‌స‌మే. మ‌రి... సుశాంత్ తీసుకున్న నిర్ణ‌యం సరైనదేనా..? కాదా..? అనేది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments