వివాద‌స్పద చిత్రంతో విజ‌య్ దేవ‌ర‌కొండ... ఇంత‌కీ ఏం జ‌ర‌గ‌నుంది..?

మంగళవారం, 21 మే 2019 (15:47 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పైన రూపొంద‌నున్న కొత్త చిత్రం హీరో. ఈ సినిమా సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరోహీరోయిన్‌లపై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే ర‌వికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో హీరో సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. పేట్ట ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌ కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవిందరాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నేను నడుంకిందకు చీరకడితే అంత బజ్ వస్తుందని ఊహించలేదు...