Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నపిల్లల్లో ఒబిసిటీని దూరం చేసేవి ఇవే...?

చిన్నపిల్లల్లో ఒబిసిటీని దూరం చేసేవి ఇవే...?
, శుక్రవారం, 17 మే 2019 (18:05 IST)
చిన్నపిల్లల్లో ఊబకాయం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీని వలన అనేక అరోగ్య సమస్యలు తలెత్తుతాయి.  సరైన పోషకాలు అందకపోవడం సరైన వ్యాయామాలు చేయకపోయడం దీనికి ప్రధాన కారణం. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందులు వాడటం కంటే సహజ సిద్ధంగా నయం చేసుకోవడం చాలా మంచిది. సజ్జలు ఈ సమస్యకు మంచి పరిష్కారం. 
 
దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. స్థూలకాయ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ మొలకెత్తిన సజ్జలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎదిగే పిల్లలకు సజ్జలు మంచి ఔషధంలా పని చేస్తాయి. పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి. అంతేకాకుండా పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతాయి. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. 
 
ఇందులో ప్రోటీన్స్, పీచు పదార్థం పుష్కలంగా ఉండడం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి. అంతేకాకుండా కండరాలకు ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం చాలా మంచిది.
 
సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని ఆహారం. ఇవి రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి రక్తంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. సజ్జలలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలలో, పిల్లల్లో రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాకుండా ఎసిడిటీ, కడుపులోమంట అజీర్ణం, ఇతర ఉదరకోశ సమస్యలకు సజ్జలు దివ్యౌషదం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ వైన్ తాగితే ఇన్ని ఇబ్బందులా?