Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్కంటే కేతిక శర్మదే.. త్రివిక్రమ్ కంట్లో పడింది..

Advertiesment
లక్కంటే కేతిక శర్మదే.. త్రివిక్రమ్ కంట్లో పడింది..
, బుధవారం, 22 మే 2019 (09:53 IST)
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు హీరోగా రూపొందుతోన్న 'రొమాంటిక్' సినిమాలో కథానాయికగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. 
 
ఈ చిత్రం ఇంకా పూర్తికాకముందే ఈ అమ్మడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టిలో పడింది. త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. త్వరలోనే రెండవ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. 
 
ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. రెండో కథానాయికగా కేథరిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కేతిక శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
 
అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకి ఈ అమ్మాయి అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించడంతో, ఆయన టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం. అల్లు అర్జున్ జోడీగా ఛాన్స్ పట్టేసిందంటే మాత్రం అదృష్టవంతురాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో ఉదయభాను, గుత్తా జ్వాలా ఉన్నారా?