సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

దేవి
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (18:47 IST)
Surya, Simran
సూర్య ద్విపాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. తమిళ్ లో వారనమ్ అయిరమ్ పేరుతో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు.2008 నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం తమిళ్ కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే అప్పుడూ అద్భుతమైన విజయం అందుకుందీ సినిమా. తాజాగా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి తెలుగులో విడుదల కాబోతోంది.
 
ఈ సందర్భంగా తెలుగు అనువాద బ్యానర్ సి.ఎల్.ఎన్ మీడియా ప్రొడక్షన్ హౌస్ వారు మాట్లాడుతూ.. ''సూర్య సన్నాఫ్ కృష్ణన్ తెలుగులో ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలవుతోంది. ఈ మూవీలో సూర్య అద్భుతమైన నటన చూపించారు. గౌతమ్ మీనన్ ప్రేమ నేపథ్యంలో ఓ కళాఖండాన్ని సృష్టించారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇప్పటికీ అన్ని వేదికలపైనా ఈ మూవీ పాటలు లేకుండా కనిపించదు. అంతటి ప్రజాదరణ పొందిన పాటలున్న చిత్రం ఇది.పివిఆర్ థియేటర్స్ వాళ్లు ఒక కంటెస్ట్ లవర్స్ డే వీక్ అనే ప్రోగ్రామ్ చేశారు. ఆ వీక్ లో తెలుగు నుంచి సూర్య సన్నాఫ్ కృష్ణన్ ను 12న ప్రదర్శించబోతున్నారు.

ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయిన కాసేపట్లోనే ఫుల్ అవుతోంది.13న మరో షో వేస్తున్నారు. అది కూడా ఫుల్ అవుతోంది. ప్రేక్షకులకు ఇది అంతటి ఇష్టమైన సినిమా ఇది. ఇక 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లోనూ విడుదల కాబోతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలతో పాటు తెలుగు వెర్షన్ కర్ణాటక, ఓవర్శీస్ మొత్తం మేమే విడుదల చేస్తున్నాము.టోటల్ గా 300లకు పైగా షోస్ ను ప్లాన్ చేశాం. యూత్ అంతా ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీని బూస్ట్ చేస్తోన్న పివిఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నాము. 12, 13 తేదీల్లో ప్రదర్శనలున్నా.. 14న చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాము. ఈ మూవీలోని 7 పాటలూ యూత్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పాలి. ఇలాంటి చిత్రాన్ని విడుదల చేయడం మా సంస్థకు గర్వకారణం అని చెబుతున్నాను.." అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments